అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బాలరాజు అన్నారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్, టిప్పర్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. టిప్పర్ యజమాని రామకృష్ణారెడ్డి, ట్రాక్టర్ యజమాని కృష్ణయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.