లయన్స్ క్లబ్ ఆఫ్ కొడంగల్ నూతన కమిటీని లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక కేఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా మురారి వాశిష్ట, సెక్రటరీగా భీమరాజు, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌లుగా రాజేందర్, దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.