ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల గ్రామాలలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రభుత్వ బడులలో అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, అందుకే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ ఏడాది పది ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచారన్నారు.