తాండూర్: అక్రమ ఇసుక రవాణా.. కేసు నమోదు

55చూసినవారు
తాండూర్: అక్రమ ఇసుక రవాణా.. కేసు నమోదు
వికారాబాద్ జిల్లా తాండూర్ కాగ్న నది వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారంతో పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి ఇద్దరు నిందితులైన కుద్దుల రమేష్, రామును అదుపులోకి తీసుకుని, ట్రాక్టర్ ను సీజ్ చేశామన్నారు. సీఐ మాట్లాడుతూ. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.