కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కుల సర్వేను కోతల గణన, క్యాస్ట్ సెన్సెక్స్ కాదు కటింగ్ సెన్సెక్స్ గా ఉందని వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ అభివర్ణించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సర్వేలో కులానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉండగా రాజకీయం, ఆస్తులు, అప్పులు, సంతానం, చదువు వంటి అంశాలను సేకరించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.