కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వ్యవసాయ రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కొత్తపల్లి తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు జీవన భృతి ఇవ్వాలని కోరారు. ఆసరా పెన్షన్ రూ. 4 వేలు పెంచి ఇవ్వాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.