ఎన్యుమారేటర్లు సర్వేలో పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. ఇప్పటి వరకు బ్లాక్ లో ఎన్ని కుటుంబాల సర్వే నిర్వహించారని, ఎదురైనా సమస్యలు ఏంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేలోని అన్ని అంశాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు వుంటే తనను అడగాలని సూచించారు.