అభివృద్ధికి రైతులు సహకరించాలి: సబ్ కలెక్టర్
అభివృద్ధికి రైతులు సహకరించాలని తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, కొడంగల్ తహశీల్దార్ విజయ్ కుమార్, దుద్యాల తహశీల్దార్, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.