పిడుగు పడి ఎద్దు మృతి చెందిన ఘటన వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం వికారాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో పిడుగు పడి ఏద్దు మృతి చెందడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.