వికారాబాద్ జిల్లాలో వివాహితను హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా న్యాయ స్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే. తుంకులగడ్డకు చెందిన బిచ్చపు రమేశ్ భిక్షాటన చేసుకొంటూ గ్రామానికి చెందిన శానమ్మ ఇంటిముందు తలదాచుకునేవాడు. దింతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 2020 ఫిబ్రవరి 27న శానమ్మను రమేశ్ ఇనుప కడ్డీతో తలపై మోది హత్య చేశాడు.