కొడంగల్ మండలం టేకుల్కోడ్, రుద్రారం గ్రామాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అధిక తేమ వల్ల పత్తిలో వచ్చే వేరు కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని మొక్కల పాదులు చుట్టూ వేసుకోవాలన్నారు. ఏడిఏ శంకర్ రాథోడ్, ఏఈవోలు దేవేందర్, ఇస్సాక్ హెరాల్డ్ ఉన్నారు.