భారత దేశం అభివృద్ధికి ఎంతో కృషి స మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అజాతీయ శత్రువుగా నిలిచారని తాండూరు బీజేపీ నేతలు అభివర్ణించారు. శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారి వాజ్ పేయి వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం నర్సింలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.