ఏబ్బనూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

50చూసినవారు
ఏబ్బనూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని ఏబ్బనూర్ లో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ తాజా మాజీ సర్పంచ్ పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఆయన మాట్లాడుతూ చరిత్రపై చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగక అనుక్షణo పోరాటం చేసిన దీశాలి అన్నారు.

సంబంధిత పోస్ట్