వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, అధ్యక్షులు, కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధారూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కే. విజయ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా లింగంపల్లి అశోక్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎల్లనొల్ల మహేందర్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా జి. మల్లే ష్ యాదవ్ లు నియమితులయ్యారు.