పరిగి ఎమ్మెల్యే నివాసంలో బతుకమ్మ సంబరాలు

54చూసినవారు
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి నివాసంలో బతుకమ్మ ఉత్సవాలు ఉమా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పరిగి నియోజకవర్గ మహిళలు రంగు రంగుల పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేశారు. అనంతరం బతుకమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్