వివిధ రంగాల వయో వృద్ధులకు ఉత్తమ అవార్డుల దరఖాస్తులు

84చూసినవారు
వివిధ రంగాల వయో వృద్ధులకు ఉత్తమ అవార్డుల దరఖాస్తులు
వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వయో వృద్ధులకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా మహిళా శిశు వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణ వేణి తెలిపారు. ఈనెల 25న సాయంత్రంలోగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వయోవృద్ధులు హైదరాబాద్ మలక్ పేట్ వయోవృద్ధుల సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు https: // www. wdsc. telangana. gov. in సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్