వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని రామయ్య గూడలో బుధవారం పెద్దమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకాల, మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు, భక్తులు, చిన్నారులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.