కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హకింపేట్ గ్రామనికి చెందిన ఓ రైతు తమ భూమిలో పార్మా కంపెనీ పడుతుందని, దీంతో భూములు పోకుండా ఏ విధంగా సిద్ధం కావాలో తమ దోస్తులకు పండుగ సాయన్న పాట రూపంలో తన ఆవేదనను వివరించారు. ఇంట్లో ఉన్న ఒకటే. జైల్లో ఉన్నా ఒకటే. భూమి లేని బతుకు బతకలేనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల తన దోస్తులకు భూములు కాపాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చాడు.