కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో అమే మాట్లాడుతూ. 47లక్షల మంది రైతులకు రుణమాఫి చేయాల్సి ఉంటే, 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫి అయ్యింది. ఈ లెక్కన కాంగ్రెస్ వాళ్ళే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నెలకు రాయాలి. రుణమాఫి కానీ రైతులకు డైవర్ట్ చేయడానికే హరీష్ రావుపై కామెంట్లు చేస్తున్నారు అని విమర్శించారు.