గండీడ్ మండలంలో డిసిసి అధ్యక్షులు, స్థానిక పరిగి ఎమ్మెల్యే డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి శుక్రవారం పర్యటిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి అన్నారు. గండీడ్ మండల కేంద్రంతో పాటు పెద్దవార్వాల్, మన్సూర్ పల్లి, కొండాపూర్, వెన్నచేడ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు, పలు కార్యాలయాల శంకుస్థాపనలు చేయనున్నారు. పెద్దవార్వాల్ నిర్వహించే భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొననున్నారు.