ఆశ్రమ పాఠశాలలో.. పంతుళ్ల పంచాయతీ

77చూసినవారు
ఆశ్రమ పాఠశాలలో.. పంతుళ్ల పంచాయతీ
విద్యార్థులకు విద్యను అందించే ఉపాధ్యాయులే వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఘర్షణకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం పాఠశాల ప్రిన్సిపాల్ బాలచందర్ మాతృ వియోగం చెందడంతో విధులకు దూరంగా ఉన్నారు. మరొ ఉపాధ్యాయుని ఇంచార్జ్ గా ఇవ్వడంతో.. సహ ఉపాధ్యాయులతో సమయపాలన, హాజరు వేసుకోవడం, పలు అంశాలపై ఉపాధ్యాయు బృందం మధ్య ఘర్షణ జరిగింది.

సంబంధిత పోస్ట్