సీఎం సహాయనిధి పేదలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందని కొడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, గోపాల్ రెడ్డి, ఫక్రుద్దీన్ గురువారం అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి సహకారంతో రుద్రారం గ్రామానికి చెందిన తలారి వెంకటమ్మ రూ. 53 వేలు, గొల్ల వెంకటప్ప రూ. 50 వేలు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.