మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గ్రామంలోని ఆనంద నిలయం బాలుర వసతి, ఎస్టీ బాలికల వసతి గృహంలో ఎంఆర్ఓ తిరుపతయ్య, కాంగ్రెస్ నేతలు నూతన డైట్ మెనూను ప్రారంభించారు. వసతి గృహంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కోరగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ అప్పుడే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డైట్ కాస్మెటిక్ పెంచడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.