మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో బుధవారం ఘనంగా మొహర్రం వేడుకలు జరుపుకున్నారు. తమ గ్రామంలో ఈ పండుగకు ప్రత్యేకత ఉందని, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిన వారు గ్రామానికి వచ్చి వేడుకల్లో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కే. ఎం నారాయణ తెలిపారు. మతసామరస్యాలకు అతీతంగా జరుపుకుంటామని, సాయంత్రం సమయంలో పీర్లను మసీదు నుండి బయటకు తీసి వీధుల్లో ఊరేగించిన అనంతరం నిమర్జనం చేశామన్నారు.