జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

75చూసినవారు
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను ముట్టుకోవద్దని, రైతులు పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడుపడ్డ ఇండ్లల్లో ఉండకూడదన్నారు. జిల్లా ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు గాని పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 70056 కు గాని సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్