వికారాబాద్‌: సీఎం సొంత జిల్లాలో విద్యార్థులకు నాసిరక భోజనం

65చూసినవారు
వికారాబాద్‌: సీఎం సొంత జిల్లాలో విద్యార్థులకు నాసిరక భోజనం
ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్‌లో వసతి గృహాల హాలత్ బేకార్‌గా ఉందని జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. తాండూరు పట్టణం సాయిపూర్‌లోని గిరిజన వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వసతి గృహాన్ని రాజుగౌడ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దురదృష్టకరమన్నారు.

సంబంధిత పోస్ట్