కొత్తగడిలో విద్యుత్ అంతరాయం సర్వసాధారణం అయ్యింది

64చూసినవారు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో చిన్నపాటి వర్షాలు కురుస్తేనే విద్యుత్ అంతరాయం ఏర్పడడం సర్వ సాధారణమైపోయిందని కొత్తగడి గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కొత్తగడిలో రాత్రి 8 గంటలు దాటిన కరెంటు రావడం లేదని, అసలే వర్షాకాలం ప్రారంభమవడంతో పాములు తిరిగే అవకాశం ఉందని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్