దౌల్తాబాద్ మండలం పలు గ్రామాల్లో వివిధ రకాల పనులు నిర్వహించేందుకు నిధులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు లేక పనులు నిర్వహించేందుకు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే వేలల్లో ఖర్చులు చేశామని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.