వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.