వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డీఈఐఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వికారాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె. రామాచారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-26కు సంబంధించి తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో చేరడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష జులై 10న నిర్వహిస్తారన్నారు.