మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గేటు వైపు నుంచి మహమ్మదాబాద్ వైపు వెళ్లుతున్న లారీ అతివేగంతో వెళ్లి రోడ్డు పక్కన ఉన్న గొర్రెలను ఢీకొట్టడంతో మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలను తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోకు ఢీకొట్టడంతో ఆటో స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.