అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేసిన శాసనసభాపతి

76చూసినవారు
అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేసిన శాసనసభాపతి
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎగురవేశారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు, చీఫ్ మార్షల్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్