వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహిస్తున్న దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావనకు రాకపోవడంతో కొడంగల్ బీఆర్ఎస్ శ్రేణులు వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పై మండిపడ్డారు. దీక్షా దివాస్ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ పైకి వెళ్ళిన కార్యకర్తలు.