ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 18న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గడ్డం అరుణ తెలిపారు. వికారాబాద్ ఆర్టీసీ డిపోలోని ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సమస్యల పరిష్కారం కోసం 99592 26252 ఫోన్ నెంబర్ను సంప్రదించాలన్నారు.