

నాదిర్లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.. ముట్టడించిన ఆర్మీ (వీడియో)
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ట్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ ముట్టడించడంతో ఎన్కౌంటర్ ప్రారంభించింది. పోలీసు, భద్రతా దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమై ఉగ్రవాదులను చుట్టుముట్టి ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.