వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో గల సెంట్రల్ నర్సరీలో దాదాపు పది వేల మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. గత కొన్ని నెలల నుండి నర్సరీలో గల మొక్కలను పట్టించుకునే నాథుడే లేడు. అడవులను సంరక్షించాలన్న అధికారులు ఈ విధంగా నర్సరీలో గల మొక్కలను ఎండపెడితే మొక్కలు ఎలా పెరుగుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మొక్కలకు పునఃర్జీవం పోస్తారని బుధవారం గ్రామస్తులు కోరుతున్నారు.