వికారాబాద్ పట్టణానికి ప్రధాన బ్రిడ్జి అయినా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పురాతనమై గుంతలు పడి వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతుండడంతో ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్ది ప్రయాణికులకు సౌకర్యం కల్పించారు. వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై హైదరాబాద్ నుంచి వికారాబాద్ తాండూర్ పట్టణాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి.