మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు దక్కుతుందని భావించిన వదిన హత్య చేయించింది. ఈ ఘటన వికారాబాద్(D) బషీరాబాద్(M) నవల్గా గ్రామంలో జరిగింది. వదిన సుగుణ మరిది శ్యామప్ప(39)ను చంపడానికి గ్రామానికి చెందిన ముగ్గురితో ప్లాన్ చేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఇచ్చింది. సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్పను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు.