TG: మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారా నగర్ గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. ఈ గ్రామాల పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులు సెల్ టవర్ ఎక్కి అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.