సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ విధేయుల తిరుగుబాటుతో స్థానికంగా హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్ అనుకూలవాదుల మధ్య తీవ్ర ఘర్షణలు, ప్రతీకార దాడులు చోటుచేసుకున్నాయి. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న దాడుల్లో దాదాపు 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనని చెబుతున్నారు.