మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ నెల 19న విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించాల్సిన మ్యూజికల్ కాన్సర్ట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదే క్లబ్‌లో ఓ బాలుడు మరణించిన ఘటనను దృష్టిలో ఉంచుకుని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అనుమతి నిరాకరించామని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో భారీగా అమ్ముడయ్యాయి. దీంతో నిర్వాహకులు ఇబ్బందిలో పడ్డారు.