తెలంగాణలో రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం.. మన పథకం, మన పేటెంట్, మన బ్రాండ్ అని కొనియాడారు. భూ భారతి పోర్టల్‌ను రైతులకు చేరవేయాలని సూచించారు.