దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశం అని, రాజకీయాలకు సంబంధం లేదని AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కులను తీర్చుకోవడం కోసం తన ఆరోగ్యం సైతం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చిందని అన్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.