ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.6,609.3 కోట్ల నికర నష్టం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,985.9 కోట్లతో పోలిస్తే నష్టం కొంతమేర తగ్గినట్లు పేర్కొంది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 4 శాతం మేర పెరిగి రూ.11,117.3 కోట్లకు చేరినట్లు వివరించింది.