తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం (వీడియో)

52చూసినవారు
AP: ‘రేషన్ కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్ష్మిని భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటున్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదు. రేషన్ కార్డు కోసం నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతోంది. ఇదే అదునుగా భావించిన వీఆర్వో అసహ్యంగా మాట్లాడటంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆవేదనను వీడియోలో చెప్పడంతో అది కాస్త వైరలయింది. అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్