ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూపులు

71చూసినవారు
TG: జగిత్యాల RTC బస్టాండ్‌లో బస్సు కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూశారు. జగిత్యాల నుండి కడెం వెళ్లే బస్సును 200 మంది ఎక్కడంతో పక్కకు ఒరిగింది. దీంతో ఆర్టీసీ డ్రైవర్ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దీంతో వారిని పాత బస్టాండ్‌లో దింపేశారు. మరో బస్సు కోసం ఎదురుచూశారు. ఎంతకీ బస్సు రాకపోవడంతో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. పండగ పూట తమకు తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్