TG: ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడ్ ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయారు. ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన రాత్రే ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆత్మహత్యకు గల వివరాలు తెలియారాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.