కేంద్రం ఇటీవల వక్ఫ్ బిల్లుకు సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు అనేక వాహనాలకు అల్లరిమూకలు నిప్పుపెట్టాయి. దీంతో పోలీసులు దాదాపు 110 మందిని అరెస్ట్ చేశారు. అలాగే జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపేసి, కర్ఫ్యూ విధించారు.