చిన్నతనంలోనే సింధుకు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెరిగింది. కూతురి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు సింధు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. బ్యాడ్మింటన్ శిక్షణ కోసం ఆమె రోజూ ఉదయం 3 గంటలకే నిద్రలేచేది. ఇంటి నుంచి పుల్లెల గోపీచంద్ అకాడమీకి వెళ్లి రావడానికి సింధు, ఆమె తండ్రి 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అలా రోజుకు 120 కి.మీలు వారిద్దరూ ప్రయాణించేవారు. వారి త్యాగ ఫలితంగా సింధు ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఎదిగింది.