మనం బయట వెళ్లినప్పుడు ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుంటుంది. అలాంటప్పుడు ఇబ్బంది పడుతుంటాం. అయితే అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన అంజెలో కాసిమిరో అనే 15 ఏళ్ల యువకుడు సరికొత్త ప్రయోగం చేశాడు. తన షూస్ సోల్‌లో పైజోఎలక్ట్రిక్ డిస్క్‌లను అమర్చి, ఆ బూట్లను తొడిగి అడుగు వేస్తున్నప్పుడు వాటి ద్వారా విద్యుత్ జనరేట్ అయ్యేలా చేశాడు. దీనివల్ల 2 గంటలు బాస్కెట్‌బాల్ ఆడితే 10 నిమిషాల ఫోన్ చార్జ్, లేదా 8 గంటల నడకతో పూర్తి చార్జ్ సాధ్యం అవుతుంది.